వర్షాకాలం మొదలైంది.. భీభత్సమైన వానలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా మురుగు నీరు రావడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా ధాటి తగ్గిందోలేదొ., డెంగ్యూ రూపంలో మరో వ్యాధి విలయ తాండవ చేస్తుంది. వర్షాకాలంలో విజృంభిస్తున్న ఈ వ్యాధి బారిన చాలామంది పడుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.
ఏడిస్ దోమ కాటు కారణంగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి క్రమ క్రమంగా పెరుగుతుంది. ‘ఈడిస్ ఈజిప్టై’ అనే ఒక రకం ఆడదోమ కుట్టడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. పగటిపూట ఈ దోమ కుడితే కొద్ది రోజుల్లోనే డెంగీ బారిన పడతాం. ఇది జ్వరంతో ప్రారంభమై ఒక్కోసారి ప్రాణాలు తీసే వరకు వెళ్తుంది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
డెంగీ రావడం వల్ల శరీరంలో ఫ్లేట్ లెట్స్ తగ్గుతాయి. ఇలా తగ్గడం వలన రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. ఈ క్రమంలోనే అధిక నొప్పులు వస్తుంటాయి. ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం. డేంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు శరీరంలో ప్లేట్ లెట్ స్థాయిలో తీవ్రంగా తగ్గిపోతాయి. దాంతో ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. అయితే రక్తంలో ప్లేట్ లెట్స్ ను పెంచే 9 ఉత్తమ ఆహారాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరం – ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.
బొప్పాయి- బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.
ఆప్రికాట్- ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.
క్యారెట్- క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .
బీట్ రూట్- ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.
ఆకుకూరలు- శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.
ఎండు ద్రాక్ష- రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30 శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.
దానిమ్మ- ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.
వెల్లుల్లి- శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.