8వ తరగతి అర్హతతో ఉద్యోగాలు..నెలకు రూ.63 వేల జీతం..

ఇండియన్ పోస్టాఫీస్ కు సంభంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది..ఇప్పటికే పోస్టల్ పలు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కోయంబత్తూర్‌లోని మెయిల్‌ మోటార్‌ సర్వీస్‌ మేనేజర్‌ స్కిల్డ్‌ ఆర్టిజన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..ఈ నోటిఫికేషన్ పూర్తీ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఖాళీల సంఖ్య: 7

పోస్టుల వివరాలు: గ్రూప్‌ సీ, నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌ పోస్టులు..

విభాగాలు: మోటార్‌ వెహికిల్‌(ఎంవీ) మెకానిక్‌, ఎంవీ ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, కార్పెంటర్‌, టైర్‌మెన్‌, కాపర్‌ అండ్‌ టిన్‌స్మిత్‌ ట్రేడుల్లో ఖాళీలున్నాయి.

వయస్సు: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు

జీతం: నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 8వ తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్‌: The Manager, Mail Motor Service, Goods Shed Road, Coimbatore-641001.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 1, 2022.