రూ. 25 వేల లోపు ఇన్ఫినిక్స్ ల్యాప్ టాప్ లాంఛ్.. ధర, ఫీచర్స్..

-

ప్రముఖ ఎలెక్ట్రానిక్ సంస్థ ఇన్ఫినిక్స్ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త వస్తువులను అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నారు. తాజాగా ఈ కంపెనీ మరో బడ్జెట్ ల్యాప్ టాప్ ను లాంఛ్ చేసింది. రూ.25వేలలోపు ధరతో క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 నియో విడుదలైంది. ముఖ్యంగా స్టూడెంట్స్‌ కోసం ఈ ల్యాప్‌టాప్‌ను ఇన్ఫినిక్స్ డిజైన్ చేసింది. అలాయ్ మెటల్ బాడీని ఈ ల్యాప్‌టాప్‌ కలిగి ఉంది. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 14 ఇంచుల డిస్‌ప్లేతో Infinix InBook X1 Neo వస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ టాప్‌ పూర్తి వివరాలు..

ఈ ల్యాప్ టాప్ ధర:

ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 నియో ధర రూ.24,990గా ఉంది. 8జీబీ ర్యామ్, 256జీబీ SSD స్టోరేజ్‌ను ఈ ల్యాప్‌టాప్‌ కలిగి ఉంది. ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌ లో సేల్‌కు వస్తుంది.

స్పెసిఫికేషన్లు..

ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 నియో ల్యాప్‌టాప్‌ 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ (1080×1920 పిక్సెల్) రెజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తోంది. 100 శాతం sRGB కలర్ గాముట్ కవరేజ్, 300 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇంటెల్ సెలెరోన్ క్వాడ్ కోర్ ఎన్5100 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 8జీబీ LPDDR4X ర్యామ్, 256జీబీ SSD స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌‌తో ఈ ల్యాప్‌టాప్‌ వస్తోంది. ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ఉంటుంది..

ల్యాప్‌టాప్‌లో 50Wh బ్యాటరీ ఉంటుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ద్వారా 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 11 గంటల వరకు ఈ ల్యాప్‌టాప్‌ ప్లే టైమ్ ఇస్తుందని ఇన్ఫినిక్స్ పేర్కొంది.ఈ ల్యాప్‌టాప్‌కు రెండు యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌లు, ఓ హెచ్‌డీఎంఐ పోర్ట్ ఉన్నాయి. వీడియో కాల్స్ కోసం హెచ్‌డీ వెబ్‌క్యామ్ ఉంది. రెండు మైక్రోఫోన్స్‌తో Infinix InBook X1 Neo ల్యాప్‌టాప్‌కు ఉన్నాయి… ఇకపోతే ఈ ల్యాప్ టాప్ బరువు 1.24 కేజీలు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news