India vs WestIndies : ఆ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గా శ్రేయస్ రికార్డు..!

-

టీమిండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ మ్యాచ్‌ లో శ్రేయస్‌ అయ్యర్‌ చరిత్ర సృష్టించాడు. నిన్నటి మ్యాచ్‌ టో అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇకపోతే వన్డేల్లో శ్రేయస్‌ అయ్యర్‌ తాజాగా ఇన్నింగ్స్‌ ద్వారా అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన మూడో ఇండియన్‌ బ్యాటర్‌ గా నిలిచాడు.

కాగా..వెస్టిండీస్‌ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల ఈ సిరీస్‌ లో శుభారంభం చేసి బోణీ కొట్టింది. 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ ఆఖరి బంతి వరకూ పోరాడింది.

ఈ నేపథ్యంలోనే చివరి ఓవర్‌ లో 15 పరుగులు అవసరం కాగా.. 11 పరుగులు చేసి చివరకి 305-6 తో సరిపెట్టుకుంది. అయితే..లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌ మెన్‌ రోమారియో షెపర్డ్‌ చివర్లో ధాటిగా ఆడి ఇండియాకు చుక్కలు చూపించాడు. హోసీన్‌ తో కలిసి అతడు విండీస్‌ ను గెలిపించినంత పని చేశాడు. అయితే, సిరాజ్‌ ఆఖరి ఓవర్ లో కట్టుదిట్టంగా బంతులేసి ఉత్కంఠకర పరిస్థితుల్లో ఇండియాను గెలిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news