BREAKING : నాగర్జున సాగర్ ఎడమ కాలువ నుండి సాగు నీటిని విడుదల చేశారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు నోముల భగత్, శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి, శానంపూడి సైదిరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జులై లో విడుదల చేయడం ఇదే ప్రధమమన్నారు. 6.50లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధమని చెప్పారు.
ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఏకరాలలో సాగునీరు అందుతుందని వెల్లడించారు. కృష్ణా జలాల వాటా వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తుoదని స్పష్టం చేశారు. ఆయకట్టు రైతాంగానికి సకాలంలో సాగు నీరు అందిస్తామని.. సాగర్ జలాశయానికి కిందటేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా నీరు వచ్చి చేరడం ఆనందదాయకమని పేర్కొన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.