జాతీయ జెండా తయారు చేసిన పింగళి వెంకయ్య కి గుర్తింపు లేదు – విహెచ్

-

జాతీయ జెండా రూపొందించిన పింగళి వెంకయ్య కి గుర్తింపు లేకుంటే ఎలా? అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు. బిజెపి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంటుందని.. కానీ జాతీయ జెండా రూపొందించిన పింగళి వెంకయ్యని మరిచిపోయారని అన్నారు. ఆగస్టు 2 న పింగళి వెంకయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనని స్మరించుకోవాలన్నారు. దీనిపై తాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు. జెండా తయారు చేసిన తెలుగు వాడికి గౌరవం లేకుంటే ఎలా? అంటూ ప్రశ్నించారు? ఎవరెవరికో ఉత్సవాలు చేస్తారు కానీ.. జెండా రూపొందించిన వ్యక్తికి గుర్తింపు లేదన్నారు.

ఆయన వారసులకు కూడా గౌరవం దక్కాలి అన్నారు వీహెచ్. ఇదిలా ఉంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పై స్పందించారు విహెచ్. ఇటీవల దిగ్విజయ సింగ్ తో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ఇక్కడ పరిస్థితి బాగోలేదని, బిజెపిలోకి వెళ్లాలని డిసైడ్ అయినట్లు చెప్పారట. పార్టీలో ఆయనకు గుర్తింపు లేదని అంటున్నాడని, ఒరిజినల్ కాంగ్రెస్ లో వాళ్లకు అన్యాయం జరిగిందని చెప్పాడని అన్నారు విహెచ్. పోతా అని ఆయన అంటుంటే.. ఆయన దగ్గరికి పోయి నేనేం చేయాలి అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news