బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యా పాండే ..డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన ‘లైగర్’ ఫిల్మ్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ పిక్చర్ ప్రమోషన్స్ లో మెరిసిన అనన్యా పాండే డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.
సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్ తో అనన్యా పాండే అదరగొడుతున్నదని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అనన్యా పాండే.. ఇప్పటికే పలు డ్రెస్సులో ప్రమోషన్స్ లో కనిపించగా, కుర్రకారు పిచ్చెక్కిపోయింది. కంప్లీట్ బ్లాక్ కలర్ డ్రెస్సులో అలా మెడ, నడుముతో పాటు ఎద అందాలు చూపించి చూపించనట్లుగా చూపించి పిచ్చెక్కిస్తోంది.
రెడ్ కలర్ శారీలోనూ అనన్యా పాండే లుక్స్ అదిరిపోగా, దానిని అర్పిత మెహతా డిజైన్ చేసింది. ఈ సరికొత్త చీరకట్టులో 23 ఏళ్ల అనన్యా పాండే అలా కుందనపు బొమ్మలా మెరిసిపోతున్నది. మెడకు, కుడి చేతికి తగు ఆభరణాలు ధరించిన అనన్యా పాండే అలా చూపులతో పాటు తన అందంతో సెగలు రేపుతున్నది.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ పిక్చర్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రజెంట్ క్రేజీ హీరోయిన్ గా బాలీవుడ్ లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ‘లైగర్’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల ‘కాఫీ విత్ కరణ్ షో’ సీజన్ 7లో పార్టిసిపేట్ చేసింది.
విజయ్ దేవరకొండతో కలిసి ఈ షోలో పార్టిసిపేట్ చేసిన అనన్యా పాండే..ఈ షో లో కరణ్ ప్రశ్నలకు ఓపెన్ గా ఆన్సర్స్ ఇచ్చింది. ఆదిత్యా రాయ్ కపూర్ తో తన రిలేషన్ షిప్ గురించి అనన్యా పాండే ఈ షోలో ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. అనన్య త్వరలో ‘ఖో గయే హమ్ కహా’ చిత్రంలో నటించనుంది.