కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కొత్త పథకాలను అమలు చేస్తూ వస్తుంది.అలాగే మరెన్నో ఊరట కలిగించే విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటూవస్తుంది.. తాజాగా మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.భారత రక్షణ దళాల్లో పనిచేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు సిద్ధమైంది.ఈ క్రమంలో కేంద్రం వారికి ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది.
కాగా, సైనికుల అనాథ పిల్లలకు నెలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 3వేలకు పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.అయితే, అనాథ పిల్లలకు ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1,000 చెప్పున ఇస్తున్నారు. అయితే, రక్షణ దళాల్లో సేవలందించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
సైనికుల పిల్లలు కుమార్తె, కుమారుడు కు 21 సంవత్సరాల లోపు ఉండాలి. వారికి వివాహం కాకపోతే వారు ఈ పథకానికి అర్హులు అవుతారు. ఇక, కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని మాజీ సైనికుల అనాథ పిల్లలకు అందిస్తున్నారు.. ఈ నిర్ణయం తో ప్రభుత్వం పై వారికి మరింత నమ్మకం పెరుగుతోందని అభిప్రాయ పడ్డారు. దేశం కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.. ఈ విషయం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. కేంద్రం అందిస్తున్న అన్ని పథకాలలో ఇదే బెస్ట్ అని ప్రముఖులు కొనియాడారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.. మరి కొద్ది రోజుల్లో రైతులకు పీఎం కిసాన్ 12 వ విడతను కూడా విడుదల చేయనున్నారు.