బాసర ట్రిపుల్‌ ఐటీలో మరోసారి పోరుబాట

-

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు డిమాండ్ల సాధన కోసం మరోసారి పోరుబాట పట్టారు. విద్యార్ధుల ఆందోళనతో దిగొచ్చిన అధికారులు, అప్పటికప్పుడు ఆగమేఘాల మీద మెస్‌ టెండర్లకు కొత్త నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌ ఇవ్వడమే కాదు, ఆ వివరాలను ఆర్జీకేయూటీ సైట్‌లో పెట్టి, వాటిని స్టూడెంట్స్‌కి అందజేశారు. మెస్‌ టెండర్లకు కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసిన తగ్గేదే లేదంటున్నారు విద్యార్ధులు. ఇలాంటి నోటిఫికేషన్స్‌ గతంలో చాలా ఇచ్చారు, చాలా చూశామ్‌ అంటూ ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు విద్యార్థులు. ఇంతకుముందు కూడా టెండర్లు రద్దు చేశామని, జులై 24లోగా మెస్‌ టెండర్లు కంప్లీట్‌ చేస్తామని చెప్పి, మాట తప్పారంటూ ఫైరవుతున్నారు విద్యార్థులు. అయితే, ఈసారి కొత్త టెండర్లు ఖరారయ్యే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు విద్యార్థులు.

Nirmal District Basara IIIT Students Protest Again Not Take Action On Mess  Members Dnn | Basara IIIT Students Protest : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ  టెన్షన్, మెస్ లలో బైఠాయించిన విద్యార్థులు

దీంతో.. బాసర ట్రిపుల్‌ ఐటీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. మొండి పట్టుదలకు పోవద్దంటూ విద్యార్ధులకు సూచించారు ఉన్నతాధికారులు. మెస్‌ టెండర్లకు నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసినందున ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, స్టూడెంట్స్‌ మాత్రం ఈసారి వెనక్కి తగ్గేదే లేదంటున్నారు విద్యార్థులు. కొత్త మెస్‌ టెండర్లు ఖరారయ్యాకే ఆందోళన విరమిస్తామని చెబుతున్నారు విద్యార్థులు. ఇవాళ కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని బాసర ట్రిపుల్‌ ఐటీ స్టూడెంట్స్ స్పష్టంచేశారు. ఇదిలా ఉంటే.. విద్యార్థులకు మద్దతుగా తల్లిదండ్రుల కమిటీ కూడా నిలువనున్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news