లక్ష్మీపార్వతి ఆరోపణలపై నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్..!!

-

ఇటీవల ఆగస్టు ఒకటో తేదీన ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ షాక్ నుండి నందమూరి కుటుంబ సభ్యులు తేరుకోక ముందే ఈ ఇష్యూ ని రాజకీయం చేస్తున్నారు. మరి కొంతమంది ముఖ్యంగా ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి.. ఉమామహేశ్వరి మరణించిన తరువాత ఆమె రాసిపెట్టిన లేఖను చంద్రబాబు మాయం చేసి ఉంటాడు అంటూ లక్ష్మీపార్వతి బాంబు పేల్చారు. ముఖ్యంగా ఈ ఉదంతంపై సిబిఐ ఎంక్వయిరీ చేయాలంటూ మీడియా ముందు మీటింగ్ పెట్టి మరి ఆరోపించింది. ఇకపోతే అటు కొంతమంది వైసీపీ నేతలు కూడా ఉమామహేశ్వరి మృతి పై చంద్రబాబును , లోకేష్ ను నిందిస్తున్నారు. ఒకవైపు వైసీపీ నేత ట్విట్టర్ వేదికగా హెరిటేజ్ లో ఉమామహేశ్వరి గారికి వాటా ఉండడం వల్లే ఆ విషయంలో లోకేష్ కి ఉమా గారికి గొడవ జరిగిందంటూ ఆరోపించారు.

కానీ ఈ విషయంపై ఫిలిం ప్రొడ్యూసర్ నట్టి కుమార్ మాట్లాడడం జరిగింది. కూతురు మరణించి ఆ కుటుంబం బాధలో ఉంటే ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటి అంటూ ఆయన ఫైర్ అయ్యారు. రాజకీయాలంటే వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదు. ఇక అంతే కాదు ఎన్ టి ఆర్ భార్య కదా మరి ఇంట్లో ఒక విషాదం జరిగినప్పుడు వీలైతే పరామర్శించి ధైర్యం చెప్పాలి కానీ ఇలా నిందించకూడదు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే విమర్శలు చేయొచ్చు కానీ ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎందుకు లాగడం ..చనిపోయిన ఆయన కూతురిని వాడుకొని రాజకీయం చేయడం ఏమాత్రం సమంజసం అంటూ నట్టి కుమార్ ఫైర్ అవుతున్నారు.Natti Kumar: సీఎం జగన్‌ చిరంజీవినే ఎందుకు పిలుస్తున్నారు.? సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత నట్టికుమార్‌. | Producer Natti Kumar Sensational Comments On Chiranjeevi About Meeting ...

ఎవరైనా చనిపోయిన వారి మీద రాజకీయం చేయడం తప్పు అంటూ నట్టి కుమార్ మాట్లాడారు. ముఖ్యంగా ఆస్తి గురించి గొడవ అనే ఆరోపణలో నిజం లేదు.. కానీ ఇంకా ఏదో సమస్య వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news