కుటుంబానికి దూరంగా ఉంటూ.. కన్నీటి కష్టాలు చెప్పుకుంటున్న జబర్దస్త్ రీతూ..!

-

రీతూ చౌదరి.. సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకొని తన టాలెంట్ తో బుల్లితెరపై అవకాశాలను సంపాదించుకున్న ముద్దుగుమ్మ రీతూ చౌదరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా గ్లామర్ షో చేస్తూ మరింత ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న రీతూ చౌదరి ప్రదీప్ నిర్వహించినటువంటి పెళ్లి చూపులు కార్యక్రమంలో మరింత ఫేమస్ అయిందని చెప్పవచ్చు. ఇక ఆ రోజు నుంచి ఒకవైపు సోషల్ మీడియాలో మరొకవైపు జబర్దస్త్ కామెడీ షోలలో.. ఇంకొక వైపు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు షోల ద్వారా తన ఉనికిని చాటుకుంది.ఇకపోతే ఈ క్రమంలోనే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈటీవీ వాళ్ళు హలో బ్రదర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఆ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ బుల్లితెర నటీనటులు అందరూ కూడా పాల్గొని సోదరులకు రాఖీలు కట్టి సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇదే సన్నివేశాన్ని గుర్తుచేసుకొని యాంకర్ శ్రీముఖి మీ అన్నయ్య ఎక్కడ రీతూ అనగానే..ఒక్కసారిగా ఆమె ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంది. తాను ఇండస్ట్రీలోకి రావడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు అని , అందుకే కుటుంబాన్ని ఎదిరించి ఇక్కడికి వచ్చానని. తనకోసం ఎవరూ రారంటూ ఎమోషనల్ అయింది ఇక ఆ సమయంలోనే శ్రీముఖి..రీతూ నీకు ఒక సర్ప్రైజ్ అనగానే.. వెనుక నుంచి తన అన్నయ్య అమ్ములు అంటూ వేదికపైకి వచ్చారు.ఒక్కసారిగా రీతూ తన అన్నయ్యను చూసేసరికి ఎమోషనల్ అవుతూ గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది. అనంతరం తన అన్నయ్యకు రాఖీ కట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం హలో బ్రదర్స్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోన్ వదలగా ఈ ప్రోమో కాస్త నెట్టింట బాగా వైరల్ గా మారుతుంది. అంతేకాదు అందరి హృదయాలను ఈ ప్రోమో బాగా కదిలించిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news