సైకాలజీ ప్రశ్న: ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు ఓ యవతి నగ్నంగా వచ్చింది.. ఏం చేస్తావ్‌..?

-

కొంతమందికి చదవు తప్ప ఇంకేం తెలియదు. ఎంతసేపు ఆ సబ్జెక్‌ను మాత్రమే నేర్చుకుంటారు. ఇంకొంతమందికి చదువు అస్సలు బుర్ర ఎక్కదు కానీ.. ఇతరత్రా వాటిపై బాగా నాలెడ్జ్‌ ఉంటుంది. ఇంటర్వూలో అడిగే ప్రశ్నలు 50 శాతం మన సబ్జెక్టు సంబంధించినవి అయితే.. ఇంకో సగం మన తెలివితేటలకు రిలేట్‌ అయి ఉంటాయి. సైకాలజీలో రకరకాల ప్రశ్నలు అడుగుతారు. వాటికి అవతలి వారు ఇచ్చే సమాదానాలను బట్టీ.. వారి వ్యక్తిత్వాన్ని గుర్తిస్తారు. సివిల్స్ ఇతరత్రా ఇంటర్వ్యూల్లో సైకాలజిస్టులు కూడా ఉంటారు.

సైకాలజీ చాలా పెద్ద సబ్జెక్ట్. ఓ వ్యక్తిని ఫలానా ఉద్యోగానికీ లేదా పదవికి ఎంపిక చేసేటప్పుడు అతని మనస్తత్వం ఎలా ఉంది అనేది సైకాలజిస్టులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. తద్వారా ఆ వ్యక్తి వల్ల.. సైకలాజికల్‌గా ఏవైనా సమస్యలు వస్తాయా అనేది పరిశీలిస్తారు. ఓ పురుషుడితో జరిగిన ఇంటర్వ్యూలో సైకాలజిస్టులు విచిత్రమైన ప్రశ్న వేశారు. “ఓ ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉన్నావు. నీ ఇంటి చుట్టూ ఎవరూ లేరు. రాత్రివేళ ఓ యువతి నగ్నంగా వచ్చి తలుపుతట్టింది. తలుపు తీసి నువ్వు ఏం చేస్తావు” అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నను ఎదుర్కొన్న వ్యక్తి ఇలా అన్నాడు. “సార్, నేను చాలా మంచివాడిని. నేను ఆమె కప్పుకోవడానికి బట్టలిచ్చి.. లోపలికి ఆహ్వానిస్తాను” అని తెలిపాడు. అతన్ని రిజెక్ట్ చేశారు.

ఇదే ప్రశ్నను మరో అభ్యర్థిని అడిగారు. అతను కాసేపు ఆలోచించి..”ఆమె కప్పుకోవడానికి బట్టలు ఇస్తానని చెబితే.. అది రొటీన్ అవుతుంది.. అలా కాకుండా మరోలా చెప్పాలి అనుకుని అతను.. “సార్, నేను ఆమెను లోపలికి తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తాను” అన్నాడు. అతన్ని ఇమ్మీడియట్లీ గెటౌట్ అన్నారు.

ఇదే ప్రశ్నను మరో అభ్యర్థిని అడిగారు. ఆ అభ్యర్థి ఏమాత్రం ఆలోచించకుండా.. ఎదురు ప్రశ్న వేశాడు. “మీరు అడిగిన ప్రశ్న సంపూర్ణంగా లేదు. పూర్తి ప్రశ్న అడగండి” అన్నాడు. “మేము అడిగింది పూర్తి ప్రశ్నే అన్నారు. అంతకు మించి అందులో అడగాల్సింది ఏముంటుంది?” అని సైకాలజిస్టు అన్నారు.
సైకాలజిస్టు ప్రశ్నకు ఆ అభ్యర్థి ఇలా సమాధానం ఇచ్చాడు.. “ఏ అమ్మాయైనా అలా నగ్నంగా రాదు. అలా వచ్చిందంటే.. తను చిన్న పాపైనా అయివుండాలి లేదా పిచ్చిదైనా అయివుండాలి. మీరు యువతి అన్నారు కాబట్టి.. ఆమెను పిచ్చిదానిగా భావిస్తాను. ఆమెకు బట్టలు వేసి.. పోలీసులకు సమాచారం ఇస్తాను” అన్నాడు.

ఈ సమాధానంతో సైకాలజిస్టులు ఏకీభవించారు. ఇక్కడ ప్రశ్నకు సమాధానం ఏంటి అన్నది ఏంటి ముఖ్యం కాదు.. మీరు ఆ ప్రశ్నకు ఎలా రియాక్ట్‌ అవుతున్నారు, దాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు దాన్ని పూర్వాపరాల్ని విశ్లేషించడం, అంచనాలు వెయ్యడం ముఖ్యం. ఆ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు సైకాలజిస్టులు ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు. ఇంతకీ మీరు అయితే ఏం చేస్తారు..?

Read more RELATED
Recommended to you

Latest news