గవర్నర్ తమిళిసై గారికి ధన్యవాదాలు – వైయస్ షర్మిల

-

సోమవారం గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు వైయస్ షర్మిల. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాలేశ్వరం అవినీతిపై కాంగ్రెస్, బిజెపి ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. మెగా కృష్ణారెడ్డికిి అమ్ముడు పోయారా? అంటూ మండిపడ్డారు.

కాలేశ్వరంలో భారీగా అవినీతి జరిగిందని చెప్తున్న బిజెపి అధికారంలో ఉండి కూడా ఎందుకు విచారణ జరిపించడం లేదని అన్నారు. మీకు రాజకీయాలు కావాలి కానీ ప్రజా ప్రయోజనం అక్కర్లేదా? అంటూ మండిపడ్డారు. అయితే కాలేశ్వరం అవినీతి, నాసిరకం పనులపై చర్చించడానికి తన విలువైన సమయం వెచ్చించి.. ఎంతో ఓపికతో సమస్యలు విన్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు వైయస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news