నేడు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..

-

నేడు బీహార్ సిఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు మధ్యహ్నం 2 గంటలకు 8 వ సారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీశ్ కుమార్… అలాగే, ఉప ముఖ్యమంత్రి గా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న గంటలోపే రెండు సార్లు గవర్నర్ ను కలిసిన నితీశ్ కుమార్… మొదటి సారి కలిసినప్పుడు ముఖ్యమంత్రిగా రాజీనామా సమర్పించారు.

ఓ గంటలోపే, రెండవ సారి బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ ను కలిసి 164 మంది ఎమ్.ఎల్.ఏ ల జాబితా ను సమర్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏడు పార్టీ ల మద్దతు ఉన్నట్లు తెలియజేసారు నితీశ్ కుమార్. ప్రజలు ఇచ్చిన తీర్పు కు నితీశ్ ద్రోహం…ఇది ఆయన సహజ లక్షణం అంటోంది బిజేపి.

అధికారం కోసం సిధ్దాంతాలను తాకట్టు పెట్టే తత్వం నితీశ్ దని నిశితంగా విమర్శిస్తోంది బిజేపి. నిన్న తేజస్వి యాదవ్ నివాసంలో జరిగిన “ఇఫ్తార్ విందు”కు హాజరై, తేజస్వి తల్లి, లాలూ ప్రసాద్ భార్య రబ్రీ దేవిని కలిసి, గతంలో ఆర్.జే.డి తో విడిపోయిన అంశాన్ని దృష్టి లో పెట్టుకుని “క్షమించమని” నితీశ్ కుమార్ అడిగినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news