కరీంనగర్ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ లోని మల్టీప్లెక్స్ ధియేటర్ లో సినిమా చూశారు మంత్రి గంగుల, మాజీ ఎంపి వినోద్ కుమార్., ఈ సందర్భంగా మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
చరిత్రను వక్రీకరించేందుకు నేటి పాలకులు కుట్రలు పన్నుతున్నారని.. మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ చరిత్రను కించపరిచే విధంగా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మహాత్మా గాంధీని చంపిన వారిని పొగడడం మంచి పద్ధతి కాదని నిప్పులు చెరిగారు.
ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే ఎల్ఐసి లాంటి పెద్ద పెద్ద సంస్థలతోపాటు ఇతర ఇండస్ట్రీలను ప్రైవేటీకరించడం మంచి పద్ధతి కాదని విమర్శలు చేశారు. దేశం గట్టి పునాదులపై నిర్మించబడిందని.. గత చరిత్రను నేటితరం తెలుసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 2047 శతా ఉత్సవాల నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలువనుం దన్నారు వినోద్ కుమార్.