టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా అందమైన జంట ఏది అంటే గుర్తుకు వచ్చేది.. అక్కినేని నాగచైతన్య- సమంత అనే చెబుతారు. కానీ ఆరు నెలల కిందట.. తమ వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించేశారు. ఇక విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది సమంత.
ఇది ఇలా ఉండగా తాజాగా చై తన చేతిపై ఉన్న టాటూ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నా టాటూ ని ఫ్యాన్స్ ఎవరూ కాపీ కొట్టకండి. ఎందుకంటే ఇది సమంతతో నా పెళ్లి రోజు తేదీని మోర్స్ కోడ్ రూపంలో టాటూ వేయించుకున్న. కీలకమైన విషయాలని టాటూ గా వేయించుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో అవి మారిపోయే అవకాశం ఉంటుంది” అంటూ పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు ఆ టాటూని తొలగించాలని ఎప్పుడైనా అనుకున్నారా అని యాంకర్ ప్రశ్నించగా, ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. టాటూ మార్చడానికి ఏమీ లేదు. పర్లేదు అంటూ కూల్ గా సమాధానం ఇచ్చాడు.