ఏపీకి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనకు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చింది.. అని వస్తున్న వార్తలపై స్పందించారు. ఇప్పటి వరకు బీజేపీ నుంచి తనకు వచ్చిన ఆహ్వానంపై దాటవేత ధోరణితో ప్రవర్తించిన జేసీ.. తాజాగా దానిపై నోరు విప్పారు.
ఆపరేషన్ ఆకర్ష్.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రవేశపెట్టిన కొత్త పథకం అది. అదేదో.. ప్రజల కోసం పెట్టింది కాదు.. రాజకీయ నాయకుల కోసం పెట్టిన పథకం. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది బీజేపీ కల. అందుకే.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇతర పార్టీల ముఖ్య నేతలను తమ పార్టీలోకి లాక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఇప్పటికే తెలంగాణ నుంచి పలువురు నేతలకు బీజేపీ నుంచి పిలుపు రావడం.. బీజేపీ వాళ్లకు పెద్ద పెద్ద పదవుల ఆశ చూపడం.. వాళ్లు చేరడానికి అన్ని సిద్ధం చేసుకోవడం కూడా జరుగుతోంది.
తాజాగా ఏపీకి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనకు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చింది.. అని వస్తున్న వార్తలపై స్పందించారు. ఇప్పటి వరకు బీజేపీ నుంచి తనకు వచ్చిన ఆహ్వానంపై దాటవేత ధోరణితో ప్రవర్తించిన జేసీ.. తాజాగా దానిపై నోరు విప్పారు.
ఎస్.. నాకు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చింది. అది నిజమే. బీజేపీలో చేరాలంటూ బీజేపీ పెద్దలు నన్ను చాలాసార్లు అడిగారు. కొందరు బీజేపీ నేతలు కూడా నాతో టచ్ లో ఉన్నారు. కానీ… నేను ఇటీవలే రాజకీయలకు గుడ్ బై చెప్పా. ఇప్పుడు పార్టీ ఎలా మారుతాను.. అంటూ ఎదురు ప్రశ్నించారు జేసీ.
అయితే జేసీకి బీజేపీ నుంచి పిలుపు రావడం నిజమేనన్నమాట. అయినా రాజకీయాల్లో ఇవాళ ఉన్న మాట రేపు ఉండదు. రేపు ఉన్న మాట ఎల్లుండి ఉండదు. జేసీ మాత్రం తన మాట మీద ఉంటారా? బీజేపీ నుంచి బంపర్ ఆఫర్ వస్తే.. ఊరుకుంటారా? జంప్ అవరు.. చూద్దాం.. భవిష్యత్తులో ఏపీ రాజకీయాలు ఎటువంటి మలుపు తీసుకుంటాయో. ఇంకా ఎందరు రాజకీయ నేతలు బీజేపీలో చేరుతారో ఎవరికి ఎరుక.