ప్రియాంక గాంధీ ‘చేతి’కి తెలంగాణ బాధ్యతలు.. ఠాగూర్‌ ఔట్‌..!

-

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ప్రకటన రాకముందే కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ త్వరలోనే మార్చే ఆలోచనలో ఏఐసిసి వర్గాలు ఉన్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మునుగోడు ఎన్నికకు ముందే మాణిక్యం ఠాగూర్ స్థానంలో ప్రియాంక గాంధీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. వారం రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఏఐసిసి అధిష్టానం ఇప్పటికే ఇద్దరు సెక్రటరీలను మార్చింది. అయితే గత కొద్ది రోజులుగా అనేకమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఠాగూర్ ఎవరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీ కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయేటప్పుడు ఠాగూర్, రేవంత్ లపై అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే అధిష్టానం ఇంచార్జి మార్పు అనివార్యంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news