Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత

-

తన అందాలతో ఎక్స్ పోజింగ్ తో ఒకప్పుడు టాలీవుడ్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన నమిత(Namitha)ను ఎప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులు మర్చిపోలేరు. కొంత కాలం పాటు ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందాల ఆరబోతే మెయిన్ ఎజెండాగా పెట్టుకుని అవకాశాలు సాధించుకుంది.

ఇలా ఎక్స్ పోజింగ్ చేస్తూ… కుర్రకారు మతులు చెడగొట్టిన ఈ ముద్దు గుమ్మ 2017లో తన ప్రియుడైన వీరేంద్రను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. పెళ్లి తర్వాత అంతగా కనిపించకపోయినా ఈ అమ్మడుకి ప్రేక్షకుల్లో మాత్రం ఆదరణ తగ్గలేదు.

ఇది ఇలా ఉండగా తన ఫ్యాన్స్ కు నమిత గుడ్ న్యూస్ చెప్పింది. నమిత పండంటి ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి కృతజ్ఙతలు తెలిపారు. అభిమానుల ఆశీస్సులు కావాలని ఆమె కోరారు. ఇన్‌ స్టాగ్రామ్‌ లో తన ఇద్దరు శిశువులు, భర్తతో కలిసి ఉన్న వీడియోను షేర్ చేశారు నమిత.

Read more RELATED
Recommended to you

Latest news