లీటర్‌ తేలు విషం రూ. కోటి పైనే.. ఏం చేస్తారో తెలుసా..!!

-

పాము కాటేస్తే ప్రాణాంతకం అవుతుంది.. అంత ప్రమాదకరమైన పాము విషంకు మాత్రం బాగా డిమాండ్‌ ఉంటుంది. తేలు కూడా అంతే.. తేలు కుట్టి చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తేలు విషానికి మార్కెట్‌లో బాగా డిమాండ్‌ ఉంది. ఎలాంటి వాతావరంలో అయినా తేలు బతకలగదలదు. ఏడాదికి ఒకసారి తిన్నా ఇది హ్యాపీగా జీవిస్తుంది. ఇంకో హైలెట్‌ ఏంటంటే.. తినడానికి ఏ ఆహారం లేదురా అంటే.. తేలు తన జీర్ణక్రియ వేగాన్ని తగ్గించుకుంటుందట.. భలే ఉంది కదూ.. వీటి విషానికి ప్రపంచ మార్కెట్‌లో పిచ్చ డిమాండ్‌ ఉందట.. ఎందుకు.. ఏం చేసుకుంటారు..?

తేళ్ల విషంతో మందులు తయారు చేస్తారు. శరీరానికి వచ్చే కొన్ని రకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి తేలు విషానికి ఉంటుందట. ఒక గ్రాము తేలు విషం 80వేల వరకు ఉంది. అంటే లీటర్ తేలు విషం ధర రూ. 80కోట్లు వరకు పలుకుతుంది. దీంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన విషంగా తేలు విషయం ఉంది. టర్కీ దేశంలో తేళ్లను ల్యాబ్స్‌లో పెట్టి మరీ పెంచుతున్నారట..టర్కీలోని ఒక ల్యాబ్‌లో రోజుకు తేళ్ల నుంచి 2 గ్రాముల విషాన్ని సేకరిస్తున్నారు.

తేళ్లను బాక్సుల నుండి బయటకు తీసి ప్రత్యేక పద్ధతుల్లో వాటి నుంచి విషాన్ని తీస్తారు. తర్వాత విషాన్ని గడ్డకట్టించి పొడి చేసి విక్రయిస్తారు. తేలు విషాన్ని యాంటీబయాటిక్స్, కాస్మోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తయారీలో కూడా వాడతారట. ఒక తేలులో 2 మిల్లీగ్రాముల విషం ఉంటుంది. ఒక గ్రాము విషం కావాలంటే.. 300-400 తేళ్లు అవసరం అవుతాయి. తేలు విషంలో కాంపొనెంట్స్ ఉంటాయి. దీంతో కీళ్లవాతాన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించవచ్చని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనల్లో తేలింది.

మొత్తానికి తేళ్ల విషంలో అంత విషయం ఉందనమాట.. మరీ అదే తేలు కుడితే మనకు ఎందుకు అంత ప్రమాదకరం అవుతుందో.. విషం ఎక్కువ ఉన్న తేళ్లు కుడితే ప్రాణాంతకం అవుతుంది..! క్రేజీ కదా..!

Read more RELATED
Recommended to you

Latest news