దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం బయటపడుతోంది. తాజాగా దీనిపై దిల్లీ ఉపముఖ్యమంత్రి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇప్పుడు అది దేశ రాజకీయాల్లో కాక రేపుతోంది.
భాజపాలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తామంటూ తనను సంప్రదించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా. “మహారాణా ప్రతాప్, రాజ్‌పుత్ వారసుడిని. తల నరక్కుంటాను. కానీ మీలాంటి కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తల వంచను” అని సమాధానం ఇచ్చానని సిసోదియా చెప్పారు.
“భాజపా నుంచి నాకు ఓ సందేశం అందింది. ఆప్‌ను విడిచిపెట్టి భాజపాలో చేరితే.. సీబీఐ, ఈడీ పెట్టిన కేసులన్నీ మూసేస్తామన్నారు. దానికి సమాధానం ఇస్తూ.. నేను మహారాణా ప్రతాప్, రాజ్‌పుత్ వారసుడిని. తల నరక్కుంటాను. కానీ మీలాంటి కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ అబద్ధం. మీరు చేయాలనుకున్నది చేసుకోండి”-మనీశ్ సిసోదియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి
मेरे पास भाजपा का संदेश आया है- “आप” तोड़कर भाजपा में आ जाओ, सारे CBI ED के केस बंद करवा देंगे
मेरा भाजपा को जवाब- मैं महाराणा प्रताप का वंशज हूँ, राजपूत हूँ। सर कटा लूँगा लेकिन भ्रष्टाचारियो-षड्यंत्रकारियोंके सामने झुकूँगा नहीं। मेरे ख़िलाफ़ सारे केस झूठे हैं।जो करना है कर लो
— Manish Sisodia (@msisodia) August 22, 2022