వీపులో కత్తిదిగి రక్తమోడుతున్నా లెక్క చేయని అల్లరి నరేశ్..!!

-

సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు ‘అల్లరి’ నరేశ్. తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించిన నరేశ్.. ఇటీవల కాలంలో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. మహేశ్ ‘మహర్షి’ సినిమాలో కీలక పాత్ర పోషించిన అల్లరి నరేశ్.. ‘నాంది’ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారని చెప్పొచ్చు.

కామెడీకి పూర్తి విరుద్ధంగా ఉండే ఎమోషన్స్ తో ప్రేక్షకుల మెప్పు పొందారు. ‘నాంది’ చిత్రంలో బండి సూర్య ప్రకాశ్ అనే వ్యక్తిగా అల్లరి నరేశ్ నటన చూసి జనాలు ఫిదా అయ్యారు. కనకమేడల విజయ్ అనే దర్శకుడికి అవకాశం ఇచ్చిన అల్లరి నరేశ్.. ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేస్తున్నారు. మొదటి ప్రయత్నం ‘నాంది’తోనే ఘన విజయం అందుకున్న విజయ్ కనకమేడల ఈ సారి అల్లరి నరేశ్ ‘ఉగ్ర’ రూపాన్ని చూపించబోతున్నారు.

అల్లరి నరేశ్- విజయ్ కనకమేడల కాంబోలో వస్తున్న రెండో పిక్చర్ కు ‘ఉగ్రం’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో అది బాగా వైరలవుతోంది. సదరు పోస్టర్ లో అల్లరి నరేశ్..వీపులో కత్తి దిగి..రక్తమోడుతున్నా.. ఆయన లెక్క చేయకుండా అలానే పోరాడుతున్నట్లు కనబడుతోంది. అలా అల్లరి నరేశ్ ఉగ్ర రూపం ఇందులో ఉండబోతున్నదని స్పష్టమవుతోంది. యాక్షన్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ మూవీని షైన్ స్ర్కీన్ బ్యానర్ పై సాహుగారపాటి ప్రొడ్యూస్ చేస్తుండగా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news