షుగర్ కంట్రోల్​లో ఉండాలంటే ఈ డ్రైఫ్రూట్స్ తినాలి..!

-

షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే లైఫ్​లాంగ్ ఉంటుంది. డయాబెటిక్స్ వచ్చిన వాళ్లు పడే ఆందోళన అంతా ఇంతా కాదు. ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ముఖ్యంగా పండ్లు తినాలంటే బాగా ఆలోచిస్తారు. మధమేహం వచ్చిన వాళ్లు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు చెబుతుంటారు. అలా అయితేనే షుగర్ కంట్రోల్​లో ఉంటుందని హెచ్చరిస్తారు. అయితే పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు సూచిస్తున్నారు. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ వల్ల షుగర్ కంట్రోల్​లో ఉండటమే గాక గుండె జబ్బు వంటివి రావని చెబుతున్నారు. అయితే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తినాలి..?

షుగర్ ఉన్న వాళ్లు పిస్తా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్, ప్రొటీన్, విటమిన్ సి, జింక్, కాపర్, పొటాషియం, ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ డ్రై ఫ్రూట్ తినడం వల్ల షుగర్ పెరగదు.

షుగర్ పేషెంట్ల శరీరంలో బలహీనత ఎక్కువగా ఉంటుంది. అలాంటి రోగులు తమ ఆహారంలో జీడిపప్పును తీసుకోవాలి. జీడిపప్పు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా ఉండి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పు రుచి తీపిగా ఉంటుందని, పంచదారను పెంచుతుందా అనే ప్రశ్న కొందరిలో మెదులుతుంది. అయితే షుగర్ పేషంట్స్ జీడిపప్పు తింటే షుగర్ పెరిగే ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. జీడిపప్పు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందని.. గుండె ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు జీడిపప్పు తీసుకోవడం మేలు చేస్తుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది.

డ్రైఫ్రూట్స్‌లో చాలా కాస్ట్లీ వాల్‌నట్స్. ఇవి ఎంత కాస్ట్లీయో.. వీటిని తినడం వల్ల కలిగే లాభాలు కూడా అంతే మెరుగైనవి. వాల్​నట్స్ తినడం వల్ల డయాబెటిక్ రోగులకు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వాల్​నట్​ గ్లైసెమిక్ తక్కువ ఉండటం వల్ల షుగర్ పేషెంట్స్​కి ఇది మేలు చేస్తుంది. ఇవి తీయగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్స్​కి స్వీట్ తిన్న ఫీల్ కూడా ఉంటుంది. వాల్‌నట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది డయాబెటిక్ రోగుల జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ విచ్ఛిన్నం , జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది రక్తప్రవాహంలోకి చక్కెర కదలికను తగ్గిస్తుంది.

ఏదైనా అతి మంచిది కాదు. ఈ డ్రై ఫ్రూట్స్​ని అతిగా తినడం కూడా మంచిది కాదు. మితంగా తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అతి అయితే బరువు పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news