ఉదయం నిద్రలేవగానే మీరు ఏం చేస్తారు. కొందరు లేవగానే ఫోన్ చూస్తూ అలాగే మళ్లీ నిద్రపోతారు. మరికొందరేమో లేవగానే ముచ్చట్లు పెడుతుంటారు. ఇలా లేవగానే చేసే కొన్ని పనుల వల్ల ఆ రోజంతా మీపై ప్రతికూల ప్రభావం పడటమే గాక కొన్ని అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయట. అందుకే తెల్లవారిజామున మీరు నిద్ర లేవగానే ఏం చేయాలో.. ఏం చేయకూడదో ముందు తెలుసుకోవాలి.
ఉదయం లేవగానే కొందరు తమ మొబైల్ చూస్తుంటారు. దాదాపు 90 శాతం మంది చేసేది ఇదే పని. మరో 10 శాతం మంది లేచిన వెంటనే నేరుగా బాత్రూమ్కు వెళ్తామని చెబుతున్నారు. అయితే నిద్ర లేవగానే మీరు ఫోన్ పట్టుకుంటే మీ మెదడు కాస్త ఇబ్బందికి గురవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే లేవగానే ఆరోజు ఏం చేయాలో షెడ్యూల్ చెక్ చేసుకుంటామని కొందరు చెబుతున్నా.. అది అక్కడితోనే ఆగదని అంటున్నారు.
ఫోన్ పట్టుకోగానే.. ఆరోజు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనిపిస్తుందని.. వెంటనే న్యూస్ యాప్స్, సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేస్తారని.. ఇక సమయమంతా అక్కడే గడిచిపోతుందని చెబుతున్నారు. ఉదయాన్నే కొన్ని వార్తలు వినడం, చూడటం, చదవడం వల్ల అవి ప్రతికూల ప్రభావాన్ని చూపించి.. మీ మూడ్‌ని పాడు చేస్తాయన్నారు. అందుకే లేవగానే మొబైల్ చూడకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు.
మరికొందరు నిద్ర లేవడంతోనే పక్కనే ఉన్నవారితో ముచట్లలో పడిపోతుంటారు. అలా చాలాసేపు తిరిగేస్తుంటారు. లేవగానే నోటిని శుభ్రం చేసుకున్న తర్వాతే మిగతా పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే.. నోటిలోని పాచి అలానే లోపలికి వెళ్లిపోతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు మొదలవుతాయని చెబుతున్నారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరి ఉదయం లేవగానే ఏం చేయాలి అంటే.. లేవగానే మీ అరచేతులను చూడాలి. ఎందుకంటే వ్యక్తి అదృష్టం వారి అర చేతుల్లోనే దాగి ఉంటుందట. ఆ తర్వాత మాటల్లో పడకుండా నేరుగా బ్రేష్ చేసుకని ఫ్రెష్అప్ అవ్వాలి. ఆ తర్వాత ఏం చేసినా ఫర్వాలేదు.