నదిలో ట్రాక్టర్ బోల్తా​.. 8 మంది రైతులు మృతి

-

ఉత్తర్​ప్రదేశ్​లోని హర్దోయీ జిల్లాలో నదిలో ట్రాక్టర్​ బోల్తాపడిన ఘటనలో 8 మంది రైతులు మరణించారు. ఇప్పటివరకు 14 మందిని సహాయక బృందాలు కాపాడాయి. బేగ్​రాజ్​పుర్ గ్రామానికి చెందిన రైతులు నిజాంపుర్​ పులియా మండీలో దోసకాయలు అమ్మి తమ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. పాలీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గర్రా నదిపై నిర్మించిన బ్రిడ్జికి రెయిలింగ్ లేదు. దీంతో ట్రాక్టర్​ బ్రిడ్జి వద్దకు చేరుకునే సమయానికి అదుపుతప్పి న​దిలో పడిపోయింది. విషయం గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కొంత మందిని కాపాడారు.

జిల్లా మెజిస్ట్రేట్ సహా అధికారులంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేపలు పట్టేవారితో సహాయక చర్యలు మొదలుపెట్టారు. అయితే, నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం కారణంగా సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. దీంతో అధికారులు ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్ఎఫ్​ సహాయం తీసుకున్నారు. రాత్రికే ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నదిలో పడిన ట్రాక్టర్ ట్రాలీని బయటకు తీశాయి. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగించిన బృందాలు 8 మంది మృతదేహాలను వెలికి తీశాయి. అంతకుముందే 14 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news