Asia Cup 2022: టీమిండియా పేసర్ల సరికొత్త రికార్డు.. క్రికెట్‌లో ఇదే తొలిసారి

-

ఆసియా కప్‌ 2022 లో టీమిండియా శుభారంభం చేసింది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌ లో టీమిండియా.. 5 వికెట్ల తేడాతో పాక్‌ పై గెలిచింది. మొదట పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్‌ కాగా.. ఇండియా ఆ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది. పాక్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ రిజ్వాన్‌ 43 పరుగులు చేసి.. రాణించాగారు.

ఇక టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్‌ 26 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. అటు పాండ్యా 25 పరుగులు ఇచ్చి.. 3 వికెట్లు తీసి.. పాక్‌ కు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా పేస్ బౌలర్లు అరుదైన రికార్డు సృష్టించారు.

టీమిండియా తరఫున టీ 20 క్రికెట్‌ లో అన్ని వికెట్లు పేసర్లు తీయడం ఇదే తొలిసారి. ఇంతకుముందు జరిగిన టీ20 మ్యాచ్‌ లో టీమిండియా నుంచి అన్ని వికెట్లు స్పిన్నర్లు పడగొట్టారు. ఇక భువనేశ్వర్‌ కుమార్‌ టీ 20 ల్లో పాక్‌ కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేసుకున్నాడు. అటు పాండ్యా..ఆసియా కప్‌ లో పాక్‌ పై రెండోసారి 3 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news