ఏపీకి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారీ ప్రాజెక్టును కేటాయించేదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర మత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏపీలో భారీ ప్రాజెక్టు గురించి రాజ్యసభలో తెలిపారు. సభో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా మంత్రి సమాధానమిస్తూ.. ఏపీలో త్వరలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
అయితే.. ఈ ప్రాజెక్టు అనుమతులు పొందడంతో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని.. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రాయితీ ధరలకు నీళ్లు, విద్యుత్‌ను ఇవ్వడంతో పాటు.. సుమారు 5 వేల కోట్ల వరకు వీజీఎఫ్‌ను సమకూర్చుతున్నట్లు మంత్రి తెలిపారు. మరి.. ఈ ప్రాజెక్టు విషయమై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.