కాలంతోపాటు ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు పెళ్లి, రిసెప్షన్‌కు మాత్రమే వధూవరుల ఫొటోషూట్ పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెడుతున్న జంటలకు ‘ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్’ అనివార్యమైంది. అనేక ప్రాంతాల్లో, పలు విధాలుగా ఈ ఫొటోషూట్ జరుగుతోంది. ప్రకృతి ఒడిలో, ఎంచుకున్న కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోనే కాదు.. కొందరు విచిత్రంగా బురదలోనూ ఫొటోషూట్ చేసిన ఘటనలను మనం చూశాం.
అయితే, తమిళనాడుకు చెందిన ఓ యువతి మాత్రం వినూత్న రీతిలో.. వ్యాయామశాలలో బరువులెత్తుతూ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో పాల్గొనడం విశేషం. పెళ్లి కుమార్తెగా ముస్తాబైన ఆ యువతి.. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. సంయుక్త అనే ట్విటర్ యూజర్ సదరు వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘భర్త, అత్తింటివారికి ఇదో స్పష్టమైన హెచ్చరిక?’ అంటూ సరదా వ్యాఖ్యలు జోడించారు. కాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘అత్తింటివారి పనైపోయింది’, ‘ఇకపై వారు చుక్కలు చూస్తారు’ అంటూ నెటిజన్లు సైతం అంతే సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Pre-wedding photo shoot! Clear message to husband and in-laws??😀😅 pic.twitter.com/Njq0RjJXlc
— Samyuktha (@Samgurltweetz) August 28, 2022