మోడీ తో భేటీకి ముందు రాష్ట్ర అధ్యక్షుడి పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ కాబోతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయనే చెప్పాలి. లోక్ సభ ఎన్నికల ఫలతాల తరువాత రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. దీంతో ప్రధాని నరేంద్రమోడీతో జరుగబోయే భేటీలో ఏం చర్చించబోతున్నారనే చర్చ సర్వత్రా ఆసక్తిగా మారింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. తాను ఎప్పుడూ రాష్ట్ర పదవీని ఆశించలేదన్నారు. తాను అడగబోనన్నారు. హిందూధర్మ పట్ల ప్రతీ రాష్ట్రంలో ప్రచారం చేయాలనే సంకల్పంతో ఉన్నానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం మాటలకే పరిమితం అయ్యారని.. తెలంగాణ ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ప్రజల్లోకి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news