ఎదురులేని మనిషి – కేసీఆర్

-

తెరాస -ఎంఐఎం ఇన్నింగ్స్ సూపర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఎదురులేని మనిషి.. ఆయనకు తిరుగులేదు అంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెరాస -ఎంఐఎం స్నేహపూర్వకంగా తొలి ఇన్నింగ్స్ ని విజయవంతంగా పూర్తిచేశాం… రెండో ఇన్నింగ్స్ లో కూడా ఇదే రిపీట్ అవుతుంది అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 9 నెలల మందు అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, మైనార్టీల సంక్షేమం కోసం పనిచేసే తెరాస ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందన్నారు.  పేద ముస్లిం మహిళల వివాహం కోసం షాదీముభారక్ పథకంతో కేసీఆర్ ఆర్థిక  చేయూతనిచ్చారు. బడుగు బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా సుపరిపాల అందించారు అంటూ తెరాసను ఓవైసీ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. పార్టీ అభ్యర్థులను ప్రకటించే క్రమంలో తెరాస భవన్ లో అధినేత కేసీఆర్ ఎంఐఎం మాకు ఫ్రెండ్లీ పార్టీ అంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news