సమంత ఛాన్స్ కొట్టేసిన అమ్మడు

-

తెలుగులో ఒక్క హిట్ లేకున్నా తమిళంలో మేఘా ఆకాష్ కు వరుస అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో నితిన్ తో చేసిన లై, ఛల్ మోహన్ రంగ ఫ్లాపులవగా కోలీవుడ్ లో ఆమెకు హిట్లు పడుతున్నాయి. ఇక లేటెస్ట్ గా మేఘా ఆకాష్ సమంత ఛాన్స్ ను లాక్కుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 2013లో రికార్డులను క్రియేట్ చేసింది.

తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తమిళంలో ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. సుందర్ సి డైరక్షన్ లో తమిళ అత్తారింటికి దారేది రీమేక్ అవుతుంది. అక్కడ హీరోగా శింభు నటిస్తున్నాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా మేఘా ఆకాష్ ఛాన్స్ పట్టేసింది. పెళ్లి తర్వాత సమంత వరుస అవకాశాలు అందుకుంటున్నా తమిళ అత్తారింటికి దారేది ఛాన్స్ ఆమెకు రాలేదు. మరి సమంత ఛాన్స్ అందుకున్న మేఘా ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news