బంటి… డ్యాన్స్ చేయ్.. కొత్తగా ఉన్న ‘అదుగో’ టీజర్!

-

క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో వస్తున్న మూవీ అదుగో. ఈ మూవీ కోసం రవిబాబు దాదాపు రెండుమూడేళ్ల నుంచి కష్టపడుతున్నాడు. ఓ పంది పిల్లపై ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్స్ ను పూర్తి చేసుకుంటోంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రవిబాబు ఓసారి పందిపిల్లతో బయట కనిపించడం, పంది పిల్ల పళ్లు తోమడం, ప్రీ టీజర్, పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే.. ఇవాళ మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

బంటి అనే పంది పిల్లతో ఈ టీజర్ లో డ్యాన్స్ చేయించారు. ఓ పిల్లాడు వాయిస్ వోవర్ ఇస్తూ బంటితో రకరకాల విన్యాసాలు చేయిస్తాడు. ఇక.. మూవీ ట్రైలర్ సెప్టెంబర్ 12 రిలీజ్ కానుంది. సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మొత్తానికి రవిబాబు ఓ పంది పిల్లను పెట్టి సినిమా తీస్తండటం.. ఇప్పటి వరకు తెలుగు సినిమా తెరపై ఇటువంటి సినిమాలు రాకపోవడంతో తెలుగు ప్రేక్షకులు కాసింత ఆతృతతోనే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news