ఎఐసిసి ఎన్నికల గురించి షెడ్యూల్ విడుదల చేసినప్పటినుండి భారత దేశంలో ఈ ఎన్నికల గురించి ఆలోచన మొదలైందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. కొందరు గాంధీ కుటుంబం కాకుండా బయటి వారిని పెట్టాలని అంటున్నారని.. మిగితా వారిని పెడితే నాయకత్వం గ్రామగ్రామాన వెళ్ళడం కష్టమన్నారు. రాహుల్ గాంధీ ఉంటే ఎవరికి అభ్యంతరం లేదన్నారు. లేదా వాల్ల కుటుంబం నుంచి ప్రియాంక ఉంటే పార్టీకి మేలు జరుగుతుందని తన అభిప్రాయం అన్నారు.
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కుటుంబం, ప్రధాని పదవి కూడా వదులుకున్న సోనియా కుటుంబం నుంచి వస్తె బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు వీ హనుమంతరావు. సంజయ్ గాంధీ వల్ల అప్పట్లో వచ్చిన పరిస్థితి వచ్చిందని కొందరు అన్నారని.. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని కొందరు వీడటం భాదాకరమన్నారు. మా రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రైమరీ మెంబర్ షిప్ చేయని వారిని ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను ఆపేసానన్నారు. తాను.. గులాం నబీ ఆజాద్ ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామన్నారు. బోగస్ మెంబర్ షిప్ అవుతుందని ఆజాద్ చెబుతున్నాడని.. రాజీనామా చేయకుంటే పార్టీ నీ మాట వినేదన్నారు.