సెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగా యాత్ర చేపడతాం – అసదుద్దీన్ ఓవైసీ

-

సెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగా యాత్ర తో పాటు బహిరంగ సభను నిర్వహిస్తామని అన్నారు మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఈ కార్యక్రమానికి తమ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 17న జాతీయ సమగ్రత దినోత్సవంగా జరపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాసినట్లు తెలిపారు అసదుద్దీన్ ఓవైసీ.

నాడు తెలంగాణ విమోచన కోసం హిందువులు, ముస్లింలు అంతా కలిసి పోరాడారని.. తురే భాజ్ ఖాన్ విరోచత పోరాటం చేశారని అన్నారు. వలసవాదం, భూస్వామ్యవాదం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు చేసిన పోరాటాలు కేవలం ఒక భూభాగాన్ని విముక్తి చేయడానికి మాత్రమే కాకుండా జాతీయ సమైక్యతకు చిహ్నంగా చూడాలని అమిత్ షాకు రాసిన లేఖలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారుు.

Read more RELATED
Recommended to you

Latest news