రాజమౌళి చేసిన పనికి షాక్​ అయిన యాంకర్ సుమ.. అసలేమైంది?

-

కడుపుబ్బా నవ్వించే కామెడీ, సరదాగా సాగిపోయే ఆటపాటలు, సరదా ప్రశ్నలు, అప్పుడప్పుడు కంటతడి పెట్టంచే ఎమోషన్స్​ ఇలా ఎంటర్​టైన్మెంట్​ చేసే షో ‘క్యాష్’​. అయితే ఈ ప్రోగ్రామ్​కు వ్యాఖ్యాతగా చేస్తున్న సుమ.. రాజమౌళి చేసిన ఓ పనికి షాక్ అయ్యారు అదేంటో తెలుసుకుందాం.

ఒక్క సినిమా ప్లాప్​ లేకుండా… హిట్​ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి. అయితే తన సినిమాల ప్రమోషన్​లో వెనకడుగు వేయని రాజమౌళి… ప్రతీ ఒక్కరికీ రీచ్​ అయ్యే విధంగా సినిమా ప్రమోట్ చేస్తుంటారు. అయితే రాజమౌళి నోట ఓ సినిమా పేరు వచ్చిందంటే.. అది కచ్చితంగా హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. తాజాగా ఆయన బ్రహ్మాస్త్రం సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. మాములుగా సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి టీవీ షోస్​ని వాడుకుంటూ… ఉంటారు ఆయా సినీ బృందాలు. ఆ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడిందంటే టీవీ ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్​లో సందడి చేస్తుంటారు.

తాజాగా బ్రహ్మాస్త్రం చిత్రబృందం కూడా క్యాష్ షోలో పాల్గొంది. ఇందులో రాజమౌళి ఉండటం విశేషం. రాజమౌళి పనిగట్టుకుని ఎప్పుడూ లేని క్యాష్​ షోకి రావడం ఏంటి అని అనిపించవచ్చు. కానీ ఆయన రావడానికి ఓ కారణం ఉంది. సౌత్ భాషలకు సంబంధించి ఈ సినిమాకు ప్రెజెంటర్​గా ఉన్నారు. తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో బ్రహ్మాస్త్రం సినిమాను సమర్పిస్తున్నారు. అందుకే రణబీర్ కపూర్, అలియా భట్​లతో కలిసి ఆయన క్యాష్ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

రాజమౌళి రాకతో యాంకర్ సుమ ఒక్కసారిగా కల, నిజమా అన్న సందిగ్ధంలోకి వెళ్లిపోయారు. ఒకసారి గిచ్చరా అండి అని రాజమౌళితో అనగానే ఆయన సుమ చేతి మీద గిల్లారు. దీంతో ఆమె రాజమౌళి వచ్చారని కన్ఫర్మ్ చేసుకున్నారు. కాగా ఈ షో త్వరలో టెలికాస్ట్ కానుంది.

అయితే ఒకప్పుడు టాలీవుడ్​తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులు సినిమా ప్రమోషన్ల కోసం హిందీ ప్రోగ్రామ్స్, రియాలిటీ షోలలో పాల్గొనేవాళ్లు. కానీ ఇప్పుడు ఏ సినిమా రంగమైనా.. తెలుగు వారి ఆశీర్వాదం కోసం రావాల్సిందే అన్నట్లుగా బాలీవుడ్ సినిమా తయారైంది అంటూ నెటిజన్స్​ కామెంట్స్ పెడుతున్నారు. ఇది కదా సార్.. మన తెలుగు సినిమా రేంజ్ అంటూ… ట్వీట్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా అయాన్‌ ముఖర్జీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ‘బ్రహ్మాస్త్ర’ సిద్ధమైంది. ధర్మా ప్రొడెక్షన్స్ పతాకంపై కరణ్‌ జోహార్‌ దీన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పణలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news