టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ శుభవార్త..మరోసారి వారికే !

-

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. మరోసారి సిట్టింగ్‌ లకే సీట్లు ఇస్తామని.. ప్రకటించారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ లకే సీట్లు ఇస్తామని.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు తీపికబురు చెప్పారు.

ఇప్పటి నుంచే.. పార్టీ అభివృద్ధికి.. గ్రామాల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు. రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్న సందర్భంగా మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news