Asia Cup 2022: పాక్‌పై టీమిండియా సరికొత్త చరిత్ర.. 10 ఏళ్ల తర్వాత!

-

ఆసియా కప్‌ లో భాగంగా నిన్న ఇండియాపై పాక్‌ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే..ఈ మ్యాచ్‌ లో టీమిండియా ఓ రికార్డును నమోదు చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన టీమిండియాకు ఓపెన్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ మంచి ఆరంభాన్ని అందించారు.

వీరిద్దరూ తొలి వికెట్‌ కు 54 పరుగులు అందించారు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్‌ ఫలితంగా టీమిండియా పవర్‌ ప్లే లో ఒక్క వికెట్‌ కోల్పోయి 62 పరుగుల చేసింది. ఈ నేపథ్యంలో టీ 20 ల్లో పాక్‌ పై టీమిండియా తమ అత్యధిక పవర్‌ ప్లే స్కోరు నమోదు చేసింది.

అంతకుముందకు 2012 లో పాక్‌ పై టీమిండియా ప్లే లో వికెట్ నష్టపోయి.. 48 పరుగులు చేసింది. కాగా.. ఆసియా కప్‌ లో తొలి ఓటమిని చవి చూసింది టీమిండియా. గ్రూప్‌ దశలో పాక్‌ పై విజయం సాధించిన టీమిండియా… సూపర్‌ 4 దశలో మాత్రం చేతులెత్తేసింది. ఆదివారం హోరా హోరీ పోరులో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news