మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. భూమా నాగిరెడ్డి కూతురు అయిన భూమా మౌనిక రెడ్డిని త్వరలో వివాహ మాడనుఎన్నడూ మంచు మనోజ్. ఇందులో భాగంగానే తాను త్వరలో వివాహమాడబోయే మౌనిక రెడ్డి తో కలసి వినాయకుడిని దర్శించుకున్నాడు మనోజ్.
దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ విషయం బయటపడింది. ప్రముఖ రాజకీయ వేత్త దివంగత భూమా నాగిరెడ్డి దంపతుల రెండవ కుమార్తె భీమా మౌనిక అన్న సంగతి తెలిసిందే. అయితే.. మంచు మనోజ్ రెండో పెళ్లికి మోహన్ బాబు విలన్ గా మారాడని తెలుస్తోంది.
మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకుంటానని మనోజ్ ప్రపోజల్ పెట్టి మూడు నెలలు అయ్యిందని సమాచారం. అయితే.. ఈ సంబంధం మోహన్ బాబు కి ఇష్టం లేదని టాక్. వద్దని నచ్చ చెబుతున్నా మంచు మనోజ్ వినడం లేదట. దీంతో తన ఆస్తి పంచేయాలని మంచు మనోజ్ డిమాండ్ చేశాడట. దీనిలో భాగంగా ప్రస్తుతం మంచు వారింట్లో..ఆస్తుల పంపకాలు జరుగుతున్నాయట. ఆస్తుల పంపకం అయ్యాక వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని సమాచారం. కాగా..మౌనిక రెడ్డికి – మనోజ్ కి ఇద్దరికి రెండో పెళ్లే కావడం గమనార్హం.