ఇంత సడెన్ గా అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి అతడు వరల్డ్ కప్ కు సెలెక్ట్ కాకపోవడమే అని తెలుస్తోంది. కనీసం.. మొన్న ఇద్దరు బ్యాట్స్ మెన్స్ శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయపడినా… తనను కాదని.. మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్ ను తీసుకోవడంపై తీవ్ర మనస్థాపానికి గురై అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొన్ననే కదా యూవీ అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పాడు. తాజాగా మరో క్రికెటర్ క్రికెట్ కే గుడ్ బై చెప్పేశాడు. ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మ్యాన్ అంబటి రాయుడు. అవును.. ఐపీఎల్ తో సహా.. అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా కన్ఫమ్ చేసింది.
అయితే.. ఇంత సడెన్ గా అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి అతడు వరల్డ్ కప్ కు సెలెక్ట్ కాకపోవడమే అని తెలుస్తోంది. కనీసం.. మొన్న ఇద్దరు బ్యాట్స్ మెన్స్ శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయపడినా… తనను కాదని.. మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్ ను తీసుకోవడంపై తీవ్ర మనస్థాపానికి గురై అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా ప్రపంచ కప్ జట్టు కోసం అంబటి రాయడు స్టాండ్ బైలో ఉన్నట్టుగా బీసీసీఐ ప్రకటించినప్పటికీ.. శిఖర్ దావన్ స్థానంలో కానీ.. విజయ్ శంకర్ స్థానంలో కానీ.. అంబటి రాయుడును జట్టులోకి తీసుకోలేదు. రెండో సారి కూడా తనకు ప్రపంచ కప్ కోసం ఆడే అవకాశం రాలేదని అంబటి రాయుడు తీవ్రంగా మనస్థాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నాడట.
తన క్రికెట్ కెరీర్ లో అంబటి రాయుడు 55 వన్డేలు ఆడాడు. 1694 పరుగులు చేశాడు. ఆరు అంతర్జాతీయ టీ20లు ఆడిన అంబటి… 42 పరుగులు చేశాడు. ఐపీఎల్ టోర్నీలో 147 మ్యాచుల్లో ఆడిన అంబటి.. 3300 పరుగులు చేశాడు. ఇక.. తన రిటైర్ మెంట్ కంటే ముందు చివరగా… ఐపీఎల్ 2019 లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 17 మ్యాచులు ఆడాడు. వాటిలో 282 పరుగులు చేశాడు. 2013లో తన క్రికెట్ కెరీర్ ను అంబటి ప్రారంభించాడు. అంబటి రాయుడు 1985లో ఏపీలోని గుంటూరులో జన్మించాడు.
JUST IN: Ambati Rayudu announces his retirement from international cricket. pic.twitter.com/kib2X2EMok
— Circle of Cricket (@circleofcricket) July 3, 2019