నేను ఓడిపోవడానికి కారణం అదే.. అసలు నిజం బయటపెట్టిన నారా లోకేశ్

-

మీడియా చిట్ చాట్ లో భాగంగా నారా లోకేశ్ మాట్లాడుతూ… రోడ్లు, విద్య, వైద్యం లాంటి విషయాల్లో తాము బాగా అభివృద్ధి చేశామని.. అయినప్పటికీ.. తాము ఓటమి పాలు చెందడం దారుణమన్నారు. తాము అధికారంలో లేనప్పటికీ.. తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వంతో పోరాడుతానని లోకేశ్ స్పష్టం చేశారు.

మాజీ మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కొడుకు అయినప్పటికీ.. నారా లోకేశ్ బాబు మంగళగిరిలో ఓడిపోయారు. అయితే.. తాను ఎందుకు మంగళగిరిలో ఓడిపోయారో అసలు నిజం చెప్పేశారు. తాను ఓడిపోవడానికి గల కారణాన్ని ప్రజలకు చెప్పారు లోకేశ్.

మంగళగిరి ప్రజలకు చేరువయ్యేందుకు సరిపడా సమయం లేనందుకే తను ఓడిపోయారట. ఈ విషయాన్ని ఇవాళ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా చిట్ చాట్ కార్యక్రమంలో లోకేశ్ బాబు తెలిపారు.

మీడియా చిట్ చాట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ… రోడ్లు, విద్య, వైద్యం లాంటి విషయాల్లో తాము బాగా అభివృద్ధి చేశామని.. అయినప్పటికీ.. తాము ఓటమి పాలు చెందడం దారుణమన్నారు. తాము అధికారంలో లేనప్పటికీ.. తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వంతో పోరాడుతానని లోకేశ్ స్పష్టం చేశారు.

పార్టీలోని ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆరుగురు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. కార్యకర్తలను కాపాడుకోవాలంటే ప్రభుత్వంపై పోరాటం చేయక తప్పదు. గతంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఓ ఆరు నెలల పాటు.. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించదు. ఆరు నెలల తర్వాతే ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించేది. కానీ.. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను, ప్రజల ఇబ్బందులను చూస్తే అంత సమయం సరికాదనిపిస్తోంది.

ఐటీ పరిశ్రమలు రాష్ట్రం నుంచి తిరుగు ముఖం పడుతున్నాయి. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నాయి. జగన్ నవరత్నాలు మాత్రమే అమలు చేస్తామని చెబుతున్నారు. మరి… పాదయాత్రలో ఇచ్చిన 400 హామీల అమలు సంగతి ఏంటి.. అని ఆయన మీడియా ముఖంగా ఏపీ సీఎం జగన్ ను లోకేశ్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news