బిగ్ బాస్ 6: బిగ్ బాస్ కెప్టెన్ కి ఈవారం ఇచ్చిన పవర్ ఏంటో తెలుసా..?

-

బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవల మొదటి వారం విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక మొదటివారం పూర్తయిన తర్వాత హీరో బాలాదిత్య కెప్టెన్ గా ఎన్నికయ్యారు. ఇకపోతే చివరివరకు అభినయశ్రీ, ఇనయ రెహమాన్ ఇద్దరినీ ఎలిమినేషన్స్ లో ఉంచి టెన్షన్ పెట్టాడు . తర్వాత ఇద్దరు సేఫ్ అని చెప్పేసరికి ఇద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక మొదటివారం కాబట్టి సెటిల్ అవ్వడానికి సమయం పడుతుందని , రెండో వారం నుంచి మాత్రం కచ్చితంగా ఎలిమినేషన్స్ ఉంటాయని ఆడియన్స్ కి చెప్పాడు . ఇక రెండో వారం నామినేషన్ తో హౌస్ హీట్ ఎక్కబోతోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గత వారం లాగే ఈ వారం కూడా నామినేషన్ లో ఇద్దరు రివ్యూవర్స్ ఉన్నట్లుగా సమాచారం..

ఇప్పటివరకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న బజ్ ప్రకారం చూస్తే నామినేషన్ లో రేవంత్, ఆది రెడ్డి , గీతూ, అభినయశ్రీ, షానీ, రోహిత్ కపూర్ , రాజశేఖర్, ఫైమా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ నామినేషన్ లో ఎప్పటిలాగే ట్విస్ట్ ఇచ్చాడు . మరో ఇద్దరిని కెప్టెన్ ని నామినేట్ చేయమని స్పెషల్ పవర్ ఇచ్చినట్లుగా సమాచారం. మరి బాలాదిత్య ఎవరిని నామినేట్ చేసాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక నామినేషన్ లో రాజశేఖర్ ,ఆరోహీ, ఫైమా, ఆదిరెడ్డి, గీతూ గట్టిగానే ఆర్గుమెంట్స్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈసారి గీతూ, రేవంత్ ఇద్దరినీ హౌస్ మేట్స్ టార్గెట్ చేసి ఎక్కువ ఓట్లు వేసినట్లుగా సమాచారం. ఇక రేవంత్ కూడా బాగా రెచ్చిపోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా ఉంది.

చెప్పాలి అంటే రేవంత్ సింగర్ గా మంచి గుర్తింపుని తెచ్చుకొని.. ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు… మరొకవైపు గలాటా గీతూ కూడా తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరి ఇద్దరూ కూడా సెలబ్రిటీలే కావడం.. ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news