రాహుల్ టీ షర్ట్ దుమారం.. అమిత్ షాపై అశోక్ గహ్లోత్ ఎదురుదాడి

-

రాహుల్ గాంధీ నేపథ్యంలో నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రాహుల్ ధరించిన టీ షర్ట్ నుంచి ఆయన కలుస్తున్న వ్యక్తుల వరకు ప్రతిదానిపై నిఘా ఉంచి కమళదళం ఎప్పటికప్పుడు విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే ఉంది. ముఖ్యంగా యాత్రలో రాహుల్ ధరించిన టీషర్ట్ పై మొదలైన దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది.

భారత్‌ జోడో యాత్ర’లో పాల్గొంటున్న రాహుల్‌ గాంధీ ధరించే టీ షర్టు ధర రూ.40 వేలంటూ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ ఎదురు దాడి కొనసాగిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉపయోగించే మఫ్లర్‌ ధర రూ.80 వేలని.. బీజేపీ నేతలు వాడే కళ్లద్దాల విలువ రూ.2.5 లక్షలు ఉంటుందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సోమవారం జైపుర్‌లో విమర్శించారు.

జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న కారణంగానే భాజపా ఆందోళన చెందుతోందని.. అందుకనే రాహుల్‌ టీ షర్టుపై రాద్దాంతం చేస్తోందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news