చేసే తప్పుల వల్ల రిలేషన్ షిప్ లో సమస్యల కలుగుతూ ఉంటాయి. అందుకని వీలైనంత వరకు తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఒకసారి ప్రేమ కానీ నమ్మకం కానీ బ్రేక్ అయితే మరొకసారి అది పొందడం ఎంతో కష్టం.
ప్రేమికుల మధ్య అయినా భార్య భర్తల మధ్య అయినా ప్రేమ ఉండాలంటే వాళ్ళ ప్రవర్తన కూడా బాగుండాలి. అదే విధంగా ఏ సంబంధం లో అయినా సరే నమ్మకం తప్పక ఉండాలి. నమ్మకం లేదంటే అక్కడ ప్రేమ కలగదు. మీ ప్రవర్తన కనుక ఇలా ఉంటే మానుకోండి లేదంటే అనవసరంగా రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది.
మెసేజ్లు చేసి కానీ ఫోన్ చేసి కానీ వేధించద్దు:
ఎక్కువమంది వారు ప్రేమిస్తున్నారు కదా అని పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు దీని వల్ల మీ మధ్య గొడవలు వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ స్పేస్ అనేది చాలా ముఖ్యం ప్రతిరోజు మాట్లాడటం అవసరం కానీ పదేపదే ఫోన్ లేదా మెసేజ్ చేస్తూ వేధించడం తప్పు.
గతం గురించి ప్రశ్నలు వేయొద్దు:
చాలామంది పదేపదే గతాన్ని తవ్వుతూ ఉంటారు అలా చేయడం మంచిది కాదు అది వాళ్ళ గొడవలను తీసుకు వస్తూనే ఉంటుంది. దీని మూలంగా బంధం కూడా బ్రేక్ అవుతుంది కాబట్టి గతం గురించి మాట్లాడొద్దు.
వెక్కిరించడం మానేయండి:
ఎవరిని వెక్కిరించిన ఎవరికీ ఇష్టం ఉండదు కాబట్టి వెక్కిరించే అలవాటు మీకు ఉంటే దానిని కూడా మానుకోండి లేదంటే అనవసరంగా మీ రిలేషన్ షిప్ బ్రేక్ అవుతుంది,