ఈ మౌజ్ గురించి తెలిస్తే నోర్లు వెల్లబెట్టాల్సిందే..

-

మాములుగా కొన్ని రకాల కంపెనీలు తమ ఉత్పత్తుల పై జనాలకు తెలియజెయ్యాలని కొత్త జిమ్మికులు చేస్తారు.ఏదొక దానిని ప్రత్యేక ఆకర్షణ తీసుకువచ్చి సేల్స్ ను పెంచుతారు.ఉద్యోగులు కూడా కంపెనీ పెట్టె టార్గెట్ ను రీచ్ అవ్వడానికి కొంత మంది ఉద్యోగులు ఓవర్‌టైమ్‌ పనిచేస్తుంటారు. ఈ క్రమంలో ఒత్తిడికి లోనవుతుంటారు..

అలాగే..వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయలేకపోతారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉపయోగపడేలా శాంసంగ్‌ కంపెనీ కొత్త డివైజ్‌ను అభివృద్ధి చేస్తోంది.ఈ శాంసంగ్‌ బ్యాలెన్స్‌ మౌజ్‌ పేరుతో కంప్యూటర్‌ మౌజ్‌ను పరిచయం చేయనుంది. ఉద్యోగులు తమ డ్యూటీ టైమ్‌ తర్వాత కూడా పనిచేయాలనుకుంటే ఈ మౌజ్‌ పనిచేయదు. ఒకవేళ మౌజ్‌ను చేతితో తాకేందుకు ప్రయత్నిస్తే ఉద్యోగి చేతికి చిక్కకుండా పక్కకు జరుగుతుంది.

ఈ మౌజ్ కు సంభందించిన వీడియోను కొరియన్ యూట్యూబ్‌ ఛానల్‌లో విడుదల చేసింది..ఆఫీస్‌ టైమ్‌ తర్వాత కూడా పనిచేసేందుకు యూజర్‌ మౌజ్‌పై చేతిని ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. అప్పటి వరకు మౌజ్‌లా ఉన్న డివైజ్‌లోంచి చెవులు, తోక బయటకు వచ్చి పక్కకు జరుగుతుంది.

అలా మౌజ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ చేతికి అందకుండా ముందుకు, పక్కకు జరుగుతూ పోతుంది. దీంతో యూజర్‌ దాన్ని బలవంతంగా పట్టుకుంటాడు. వెంటనే మౌజ్‌ పైభాగం చేతిలో ఉండి కింది భాగం దూరంగా వెళ్లిపోతుంది. దీంతో యూజర్‌కు తన పనివేళలు ముగిశాయని గుర్తుచేసినట్లు అవుతుందని శాంసంగ్‌ చెబుతోంది. మౌజ్‌ పక్కకు జరిగేందుకు వీలుగా ఇందులో చక్రాలను అమర్చారు..దీంట్లో సెన్సార్ లను ఉంచారు.ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ మౌజ్‌ను త్వరలోనే మార్కెట్ లోకి విడుదల కానుంది..మొత్తానికి ఈ మౌజ్ గురించి వింటూంటేనే గమ్మత్తుగా ఉంది.. ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుందా అని కొందరు ఉద్యోగులు ఎదురుచూస్తూన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news