‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పార్ట్2 రిలీజ్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన మణిరత్నం

-

భారీ తారాగణంతో విడుదలకు సిద్ధమవుతున్న సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండోభాగానికి సంబంధించి దర్శకుడు మణిరత్నం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరికొన్ని నెలల్లోనే పొన్నియిన్‌ సెల్వన్‌ రెండో భాగం విడుదలవ్వనుందని తెలిపారు. ‘‘పొన్నియిన్‌ సెల్వన్‌ మొదటి భాగం విడుదలైన 6 నుంచి 9 నెలల తర్వాత రెండో భాగం విడుదలవుతుంది. ప్రస్తుతం చిత్ర నిర్మాతలు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు’’ అని తెలిపారు.

ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. భారీ తారాగణంతో మణిరత్నం కలల సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్యరాయ్‌, త్రిష నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. చోళ రాజ్యం నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఏఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news