దేవీ నవరాత్రుల్లో నవదుర్గలు వీరే!!

-

దేవీ నవరాత్రులు దేశమంతా ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ సమయంలో అమ్మవారికి విశేష ఆరాధనలు, పూజలు, హోమాలు నిర్వహిస్తారు. అమ్మను తొమ్మిది రోజులు ఆయా రూపాల్లో అలకరించి ఆరాధించడం సనాతనంగా వస్తున్న సంప్రదాయం. తొమ్మిది రోజులు అమ్మను అలంకరించే రూపాలనే నవదుర్గలుగా పిలుస్తారు. ఆ రూపాలు వరుసగా.. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరీ, సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు.

 

ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రి-గాయత్రీదేవి, చంద్రఘంట-అన్నపూర్ణ,కూష్మాండ-మహాలక్ష్మి, స్కందమాతను లలితా త్రిపురసుందరి, కాత్యాయిని- సరస్వతీదేవి, కాలరాత్రిని దుర్గాదేవి, మహాగౌరి-మహిషాసురమర్దని, సిద్ధి ధాత్ని-రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి పూజిస్తారు.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news