ఈ దేశాల్లో ఇలా సైగలు చేస్తే అంతే సంగతులు..!

-

మాములుగా మాట్లాడుకోవడం ద్వారా భావాలను ఎక్స్ప్రెస్ చేస్తుంటాము. అలా మాటల్లో కాకుండా
కొన్ని సైగల ద్వారా కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తుంటాము. అయితే ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు అన్ని దేశాల్లో ఎక్స్ప్రెస్ చెయ్యకూడదు. మరి ఏవి తప్పు అనేదే చూద్దాం.

 

బొటనవేలుని చూపడం:

ఇలా సైగని చూపడం కొన్ని దేశాల్లో తప్పు. ఈ సైగను మనం చేతివేళ్లతో అఫ్గానిస్థాన్, ఇరాన్, ఇటలీ, గ్రీస్ వంటి వాటి చోట చూపకూడదు. దీని అర్ధం వేరేలా అర్ధం అవుతుంది. కనుక ఇక్కడ బొటన వేలుని చూపకూడదు.

చూపుడు వేలు తో పిలవద్దు:

పిలిచేటప్పుడు చూపుడువేలితో పిలవడం కూడా చాలా దేశాలలో తప్పు. కనుక ఫిలిప్పీన్స్, సింగపూర్, జపాన్ దేశాలలో చూపించకూడదు కాబట్టి అలా చేయకండి. ఫిలిప్పీన్స్లో కుక్కల్ని చూపుడు వేలితో పిలుస్తారు అదే జపాన్ లో సింగపూర్ లో అయితే అది చావుకి ప్రతీక.

క్రాస్ ఫింగర్స్ చేయకండి:

ఇలా ఫింగర్స్ చూపిస్తే వియత్నాంలో చెడుగా భావిస్తారు ఆడవాళ్లు కనుక ఇలా చూపిస్తే అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

విక్టరీ సింబల్ వాడకండి:

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్లో విక్టరీ సింబల్ ఉపయోగించద్దు. ఇది నిజంగా ఇబ్బందికరం ఇలా చూపించడం మధ్య ఫింగర్ ని చూపించినట్లు.

సూపర్ అని చూపించొద్దు:

బ్రెజిల్, ఫ్రాన్స్, టర్కీ దేశాలలో ఇలా చేయకూడదు ఇది కూడా ఎంతో చెడుగా భావిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news