బేగంపేట, గోషా మహల్‌లో లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసరా పింఛన్లు పేదలకు ప్రభుత్వం అందిస్తున్న భరోసా అని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులు, వితంతువులకు రూ.2016, వికలాంగులకు రూ.3016 అందిస్తున్న ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అని పేర్కొన్నారు మంత్రి తలసాని. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు మంత్రి తలసాని.
అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతుంటే ప్రతిపక్షాలు కండ్లు ఉన్న కబోదులుగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి తలసాని. ప్రతి పక్షాలు ఇకనైనా తమ పద్ధతి మార్చుకొని మంచి పనులను చేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు మంత్రి తలసాని. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు మంత్రి తలసాని.