వరల్డ్‌కప్ 2019 సెమీఫైనల్‌లో షమీకి షాక్.. తుది జట్టులోకి ఎంపిక చేయని కోహ్లి..!

-

షమీ ఈ వరల్డ్ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ కోహ్లి అతన్ని నేటి మ్యాచ్‌లో జట్టులోకి తీసుకోకపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీంతో మాజీ క్రికెటర్లు కూడా కోహ్లి నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.

వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లి నంబర్ వన్ బ్యాట్స్‌మన్.. కోహ్లి కెప్టెన్‌గా మైదానంలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తాడో అందరికీ తెలుసు. అయితే జట్టు ఎంపిక విషయంలో కోహ్లి తీసుకునే నిర్ణయాలు కూడా అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. గతంలో కోహ్లి ఏ రెండు మ్యాచ్‌లకు ఒకే టీంను ఆడించలేదు. దీంతో ప్రతి మ్యాచ్‌లోనూ కోహ్లి టీంను మారుస్తుంటాడని గతంలో అతనిపై విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా దాదాపుగా అలాంటి విమర్శలనే కోహ్లి ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంతటి అద్భుత ప్రదర్శన చేశాడో అందరికీ తెలిసిందే. ఆడింది మూడు మ్యాచ్‌లే అయినా.. ఒక హ్యాట్రిక్ సహా షమీ మొత్తం 13 వికెట్లు తీసి వరల్డ్‌కప్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో ఇవాళ మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లోనూ షమీకి చోటు దక్కుతుందని అందరూ భావించారు. ఆఖరికి క్రికెట్ పండితులు, మాజీ క్రికెటర్లు కూడా షమీకి తుది జట్టులో చోటు కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. కానీ టీమిండియా కెప్టెన్ కోహ్లి మాత్రం అందరి అంచనాలను తారుమారు చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ్టి మ్యాచ్‌లో అతను షమీని జట్టులోకి తీసుకోలేదు. దీంతో కోహ్లిని అందరూ విమర్శిస్తున్నారు.

షమీ ఈ వరల్డ్ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ కోహ్లి అతన్ని నేటి మ్యాచ్‌లో జట్టులోకి తీసుకోకపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీంతో మాజీ క్రికెటర్లు కూడా కోహ్లి నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో ఆడుతున్నప్పుడు బౌలింగ్ అటాక్ సమర్థవంతంగా ఉండాలని, అందుకు గాను షమీని ఎంపిక చేసి ఉండాల్సిందని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మరో బౌలర్ కుల్దీప్‌ను కాదని జడేజాకు జట్టులో అవకాశం కల్పించడాన్ని కూడా కొందరు తప్పు పడుతున్నారు. జడేజా కన్నా కుల్దీప్ బాగా స్పిన్ వేయగలడని, అలాంటప్పుడు అతన్ని కాదని జడేజాకు అవకాశం కల్పించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఇవాళ్టి మ్యాచ్‌లో భారత్ ఓడితే గనక.. ఒక్కసారిగా అందరూ కోహ్లినే విమర్శిస్తారు. మరి ఈ మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించి కోహ్లి విమర్శలకు చెక్ పెడతాడా… లేదా.. అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news