బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఉత్తర బంగ్లాదేశ్‌లోని పంచాగఢ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల బంగ్లాదేశ్‌లో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో గంగా, బ్రహ్మపుత్రతో కలిపి గతేడాది డిసెంబర్లో జరిగిన ప్రమాదంలో సుమారు 37 మంది మరణించారు. అంతకుముందు నవంబర్‌లో జరిగిన పడవ ప్రమాదంలో 85 మంది మృతి చెందారు. ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతున్నా.. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా తమ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని బంగ్లాదేశ్ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సరైన భద్రతా చర్యలు చేపట్టి మరిన్ని పడవ ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.